పవన్ కల్యాణ్ సాహొ డైరెక్టర్ సుజిత్ తో ఒక సినిమా ఫైనల్ అయిన సంగతి తెలిసిందే.సుజిత్ సినిమా పాన్ ఇండియా టార్గెట్ గా జపాన్, ఇండియా మధ్య నడిచే గాంగాస్టర్ పాత్ర సూపర్ ఏలివేషన్స్ తో ఉండబోతోంది. సినిమా కు డివివి దానయ్య నిర్మాతగా వ్యవరిస్తున్నారు.ఇక ఈ సినిమా సోమవారం అధికారికంగా పూజ కార్యక్రమాలు చేసి ప్రారంభం అయ్యింది. దే కాల్ హిట్ OG అనే వర్కింగ్ టైటిల్ పై స్టార్ట్ చేసారు.
ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ కేవలం ముప్పై రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం అయితే సుజిత్ బుల్లెట్ స్పీడ్ లో పవన్ కల్యాణ్ సీన్స్ కంప్లీట్ చేయాలి.ఇక ఈ సినిమా కోసం డైరెక్టర్ స్క్రిప్ట్ వర్క్ పక్కాగా పూర్తి చేసుకొని రెడీగా ఉన్నట్లు, స్క్రిప్ట్ కూడా సూపర్ గా వచ్చిందని పవన్ కల్యాణ్ స్టయిల్ కు సరిపోయే విధంగా ఉందని అంటున్నారు.
అయితే ఈ సినిమా విషయంలో ఆసక్తికరమైన న్యూస్ హల్చల్ చేస్తోంది. అదేమిటంటే ముందు ఈ స్క్రిప్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరకు వెళ్లిన తర్వాత మహేష్ బాబు చాలా కరెక్షన్స్ చెప్పడంతో వెనక్కి వచ్చిందట. ఈ లోపు నిర్మాత దానయ్య విని కొన్ని మార్పులు చేర్పులు చేపించి పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలనే ఆలోచన తో కలిసారట. పవన్ కల్యాణ్ మాత్రం తక్కువ డేట్స్ లో తొందరగా పూర్తి చేస్తే ఓకే అని ఆమోదం తెలిపి అగ్రిమెంట్ చేసారని తెలుస్తోంది.