నిరుద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో రాబోయే మూడేళ్లలో 38,800 టీచర్, ఇతర సిబ్బంది ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 740 పాఠశాలతో 3.5 లక్షల గిరిజన విద్యార్థులకు వీరి ద్వారా సేవలు అందిచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు.
ప్రస్తుతం ఉన్న 157 మెడికల్ కాలేజీలతో కలిపి మరో 157 కొత్త నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. పిల్లలు, యుక్త వయస్సుల వారి కోసం జాతీయ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ పేర్కొన్నారు. భౌగోళిక అంశాలు, భాషలు, కళలకు సంబంధించి నాణ్యమైన పుస్తకాల లభ్యతను సులభతరం చేయడం కోసం దీనిని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.