సూపర్ స్టార్ మహేష్ బాబుకు తెలుగు సినీ పరిశ్రమలో పెద్దగా స్నేహితులు లేరు. ఈ మధ్య కాలంలో అందరితో కలుస్తున్నాడు గానీ..గతంలో ఆ రిలేషన్ కూడా ఉండేది కాదు. తన సినిమాలు…వ్యక్తిగత వ్యవహారాలు తప్ప! ఇలాంటి విషయాలకు దూరంగా ఉండేవాడు. మాద్రాసులో చదువుకున్నప్పుడు కొంత మంది స్నేహితులు ఉండేవారు. ఇప్పుడు వాళ్లు కూడా టచ్ లో లేరు. హైదరాబాద్ కు వచ్చేసిన తర్వాత పూర్తిగా లోన్లీగానే ఉన్నాడు. సినిమా వాళ్లతో రిలేషన్ కూడా ఆ సినిమా వరకూ పరిమితం. ఇప్పటివరకూ మహేష్ చాలా మంది దర్శకులు, నిర్మాతలతో కలిసి పనిచేసాడు. కానీ ఏ దర్శకుడికి ఇవ్వని ప్రాముఖ్యత వంశీ పైడిపల్లికి ఇస్తున్నట్లు ఇటీవల చోటు చేసుకున్న కొన్ని సన్నివేశాలను బట్టి తెలుస్తోంది.
మహర్షి సినిమాతో మొదలైన ఈ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతోంది. మహేష్ ఫ్యామిలీ ట్రిపుల్లో సైతం వంశీ పాల్గొంటున్నాడంటే అతనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. వంశీ ఇంగ్లాడ్ లో మహేష్ కుటుంబంతో కలిసి ఇండియా క్రికెట్ మ్యాచ్ లు వీక్షించడం. మహేష్ ఫ్యామిలీ ఈవెంట్స్ పాల్గొనడం. ఇలా ప్రతీది వీళ్ల బాండింగ్ ను ఎలివేట్ చేస్తోంది. తాజాగా నేడు వంశీ పైడిపల్లి పుట్టిన రోజు కావడంతో మహేష్ ప్రత్యేకంగా విష్ చేసాడు. కేక్ కట్ చేసి తినిపించి మరీ శుభాకాంక్షలు తెలిపాడు. గత రాత్రి ఇద్దరు చాలా సరదా క్షణాలు గడిపాం. రానున్న రోజులు నీకు అంతా మంచి జరగాలని కోరుంటున్నట్లు కామెంట్ పెట్టాడు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులకు షూర్ చేసాడు.
వంశీ నోట్లో మహేష్ కేక్…లక్కీ డైరెక్టర్
ఇప్పటివరకూ మహేష్ చాలా మంది దర్శకులతో పనిచేసాడు. అందులో కొంత మంది బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. మహేష్ ని స్టార్ గా నిలబెట్టడంలో వాళ్లదే కీలక పాత్ర. కానీ వాళ్లెవరికి దొరకని అరుదైన అవకాశం వంశీకి దొరికింది. ఈ పిక్ ను బట్టి మహేష్-వంశీల స్నేహం పాలు నీళ్లలా కలిసి పోయిందని నేటి జనులు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే మహర్షికి సీక్వెల్ ఉంటుందని ప్రచారంలో ఉంది. ఈ సన్నివేశం ఆ రూమర్ ని మరింత బలం చేస్తోంది. ప్రస్తుతం మహేష్ అనీల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నాడు.