మ‌హేశ్ బాబు కొత్త లుక్.. కెవ్వు కేక అంటున్న ఫ్యాన్స్..!

-

సుదీర్ఘ కాలం ఇంటికే ప‌రిమిత‌మైన సూపర్‌స్టార్ మ‌హేశ్ బాబు తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నారు. అయితే అది సినిమా షూటింగ్ మాత్రం కాదు.. కేవలం కమర్షియల్ యాడ్ మాత్రమే. దాని కోసం మళ్లీ మొహానికి మేకప్ వేసుకున్నాడు మహేష్. పూర్తిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఈ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ యాడ్‌ను నేషనల్ లెవెల్ యాడ్ ఫిలింమేకర్ అవినాశ్ గోవారికర్ రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా మహేశ్ బాబును తీసిన ఓ ఫోటోను గోవారికర్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. కళ్లు చెదిరే రీతిలో స్టన్నింగ్ లుక్స్‌ తో ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది.

కాగా దీనిపై మహేశ్ స్పందిస్తూ మళ్లీ పనిలో దిగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇకపోతే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమాను మహేష్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా మహానటి ఫెమ్ కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news