త్రివిక్రమ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు..!!

-

ఈ రోజు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి పుట్టిన రోజు. ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు. తన సినిమా లు అచ్చ తెలుగు పదాలు తో అందంగా ఉంటాయి. తనతో సమానంగా వుండే దర్శకులు కూడా తనని విపరీతంగా అభిమానిస్తారు.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు  తో SSMB28 మూవీ చేస్తున్నారు  ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇటీవల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ మూవీ త్వరలో రెండవ షెడ్యూల్ కి సిద్ధం అవుతోంది.

వీరిద్దరి క్రేజీ కాంబినేషన్ పై మంచి హైప్ ఉంది. తప్పకుండా వీరిద్దరూ కలిసి ప్రస్తుతం చేస్తున్న SSMB28 మూవీ  తన మూవీ డైరెక్టర్, అయిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తన సోషల్ మీడియా  ద్వారా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేసారు మహేష్ బాబు. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న త్రివిక్రమ్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు, మీరు ఎల్లప్పుడూ ఆనందం, ఆరోగ్యంతో వర్ధిల్లాలి అంటూ మహేష్ బాబు రాసుకొచ్చారు

Read more RELATED
Recommended to you

Latest news