మహేష్ బాబు కొత్త లుక్.. మళ్లీ గడ్డం పెంచేస్తున్నాడేంటి..!

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రజెంట్ ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ సక్సెస్ ను ఫారిన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మహేశ్ ..నెక్స్ట్ ఫిల్మ్ షూట్ విషయమై మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ మూడో చిత్రం చేయనున్నాడు.

‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత వీరిరువురి కాంబోలో వస్తున్న SSMB28పై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మహేశ్ ద్విపాత్రాభినయం చేయనున్నాడని వార్తలు సోషల్ మీడియాలో వస్తన్నాయి. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు తన కుటుంబంతో ఫారన్ టూర్ లో ఉన్నాడు. కుటుంబంతో సహా విదేశాల్లో విహరిస్తున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు.

ఈ నేపథ్యంలోనే అక్కడ దిగిన మహేష్ బాబు ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు స్మార్ట్ గా గడ్డం లేకుండా ఉండే మహేష్ బాబు… ఒక్కసారిగా గడ్డంతో ప్రత్యక్షమయ్యాడు. తన భార్య నమ్రతతో కలిసి ఓ బస్ స్టాప్ లో నిల్చున్నాడు మహేష్. ఇందులో గడ్డంతో మెరిశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news