నిండుగా బట్టలు వేసుకుంటేనే గౌరవం : మహమూద్‌ అలీ

-

మహిళల వస్త్రాధారణపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సంచల వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాద్‌లో హిజాబ్ వివాదం తెలెత్తడంతో ఆయన స్పందించారు. మహిళలు పొట్టి దుస్తులు ధరించడం మంచిది కాదన్నారు. ముస్లీం మహిళలు బుర్ఖా వేసుకోవద్దని ఎవరూ చెప్పలేదని అన్నారు. హిందూ మహిళల తరహాలోనే ముస్లీం మహిళలు కూడా దుస్తులు ధరించాలని సూచించారు. పొట్టి దుస్తులు ధరించడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయన్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే నిన్న హైదరాబాద్‌లో హిజాబ్‌పై వివాదం జరిగింది.

64% Of Telangana is Under CCTV Hawkeyes: Mahmood Ali | INDToday

కేవీ రంగారెడ్డి కళాశాలలో ఉర్దూ పరీక్ష రాసేందుకు కొందరు ముస్లిం విద్యార్థినిలు వెళ్లారు. ఇక వివరాల్లోకి వెళ్తే నిన్న హైదరాబాద్‌లో హిజాబ్‌పై వివాదం జరిగింది. కేవీ రంగారెడ్డి కళాశాలలో ఉర్దూ పరీక్ష రాసేందుకు కొందరు ముస్లిం విద్యార్థినిలు వెళ్లారు. హిజాబ్ ధరించిన యువతులను కళాశాల సిబ్బంది అడ్డుకున్నారు. హిజాబ్ ధరించి వస్తే పరీక్షకు వచ్చిందెవరో గుర్తు పట్టలేమని అభ్యంతరం వ్యక్తం చేశారు. సెంటర్ లోకి వెళ్లాలంటే హిజాబ్ తీసేయాలని సూచించారు. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బందికి , విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. దాదాపు అరగంట తర్వాత చివరకు విద్యార్థునులు హిజాబ్ తీసేకి పరీక్ష హాల్లోకి వెళ్లారు.

‘మహిళలు తమకు నచ్చిన బట్టలు వేసుకోవచ్చు. కానీ యూరోపియన్ల తరహాలో కురుచ బట్టలు వేసుకోవద్దు. అలా వేసుకొనే మహిళలు ఇబ్బందుల పాలవుతారు. నిండుగా బట్టలు వేసుకుంటే రిలాక్స్ డ్ గా ఉండొచ్చు. సంప్రదాయ ముస్లింలైతే హిజాబ్, హిందువులు తలపై పల్లు(కొంగు) ధరించవచ్చు. ఇలాంటి వస్త్రధారణతో గౌరవం పెరుగుతుంది.’అంటూ వ్యాఖ్యనించారు. హిజాబ్ ధరించి పరీక్షకు వచ్చిన మహిళలను అనుమతించకపోవడంపై తాను కాలేజీ యాజమాన్యంతో మాట్లాడుతానని, సదరు కాలేజీపై తప్పక చర్యలు తీసుకుంటామని హోం మంత్రి చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news