ప్రామిస్ డే రోజు ఇలాంటి ప్రామిస్ చేయండి.. ప్రేమ మరింత రెట్టింపు అవుతుందట..!

-

వాలెంటైన్ వీక్ లో భాగంగా ఫిబ్రవరి 11న ప్రామిస్ డేగా జరుపుకుంటారు. ఈరోజు మీ ప్రిమయమైన వారికి చేసే ప్రామిస్ వారిలో బలంగా నాటుకుపోతుంది. ప్రేమకు పునాది నమ్మకమే..అలాంటి నమ్మకాన్ని మనం ఇచ్చే ప్రామిస్ ద్వారా వాళ్లలో కల్పించవచ్చు. అలాంటి కొన్ని ప్రామిస్ ను మనం ఈ కథనం ద్వారా తెలుసుకుందాం..

బాయ్ ఫ్రెండ్ తెలిపేందుకు ప్రామిస్ డే విషెస్

నీ చెయ్యి పట్టుకొని నీ వెంటే నేనుంటాను. కష్ట సుఖాల్లో నీకు తోడుగా నిలుస్తాను. హ్యాపీ ప్రామిస్ డే.

నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదిలేయనని ప్రామిస్ చేస్తున్నాను. ప్రతి సందర్భంలో నీకు నేనున్నాను మర్చిపోకు ప్రియతమా. హ్యాపీ ప్రామిస్ డే.

మాటలు కాదు.. మనస్ఫూర్తిగా చెబుతున్నా. ఎప్పటికీ నీకు నిజమైన ప్రేమికుడిగా ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. హ్యాపీ ప్రామిస్ డే.

నిస్వార్థంగా ప్రేమించా. ఏదీ ఆశించకుండా తోడుగా ఉన్నా. ఎప్పటికీ ఉంటా. ఏ కష్టమూ రాకుండా చూసుకుంటా… హ్యాపీ ప్రామిస్ డే.

గర్ల్ ఫ్రెండ్ తెలిపేందుకు ప్రామిస్ డే విషెస్

నువ్వున్నావనే నమ్మకమే నన్ను ముందుకు నిడిపిస్తుంది. నాపై నువ్వు చూపే ప్రేమ ఎప్పటికీ నాకు కావాలి. ఎప్పటికీ నీతో ఉంటానని ప్రామిస్ చేస్తున్నా. హ్యాపీ ప్రామిస్ డే.

ఎంతో మందికి ఎన్నో ప్రామిస్‌లు చేశాను. కారణం తోడుగా నువ్వు ఉన్నావనే. నువ్వే నా ధైర్యం. నువ్వే నా ప్రపంచం. నీతో ఎప్పటికీ ఉంటా. హ్యాపీ ప్రామిస్ డే.

నా ప్రతి అడుగులో నీ అచ్చు కనిపిస్తుంది. నా ప్రతి ఆలోచనలో నీ ప్రతిరూపం దర్శనమిస్తుంది. నీతోనే నా జీవితం అంటున్నా… హ్యాపీ ప్రామిస్ డే.

నీ కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు. నీతో ఎప్పటికీ ఉంటానని చెబుతున్నా… హ్యాపీ ప్రామిస్ డే.

నా ఆనందంలో నువ్వున్నావు. నా కష్టంలో నువ్వున్నావు. ధైర్యంగా అడుగులు వేయించావు. రేపటిపై ఆశలు రేపావు. ఎప్పటికీ నీతోనే నా ప్రయాణం… హ్యాపీ ప్రామిస్ డే.

రోజాతో బలపడి.. ప్రపోజ్ తో వ్యక్తమై.. చాక్లెట్ తో తియ్యగా మారి.. టెడ్డీతో సాఫ్ట్ అయిన మన ప్రేమ ప్రామిస్ తో పర్మనెంట్ అవుతుందని మాటిస్తున్నా. హ్యాపీ ప్రామిస్ డే.

మనం కలవడానికి 23 ఏళ్లు పట్టింది..ఇక జీవితంలో నీ చేయి వదలనని ప్రామిస్ చేసి చెప్తున్నా

ఎప్పటీకీ నీతోనే ఉంటా అని చెప్పలేను..కానీ కష్టం వస్తే నేను ఉన్నా అని మాత్రం మర్చిపోకు

ఇలా మీ ప్రియమైన వారికి ఈ ప్రామిస్ డే రోజు ఒక మంచి ప్రామిస్ చేసి ఇంప్రస్ చేయండి..అమ్మాయిలు ఏది పైకి చెప్పలేరు. కానీ ఇలా చేస్తే బాగుండూ అని లోపల అనుకుంటారు. కాబట్టి మీ లవర్ కు చిన్న ప్రామిస్ కొటేషన్ పంపి చూడండి ఎంత కుష్ అవుతుందో..అలాగే అమ్మాయిలూ మీరు కూడా..సీరియస్ రిలేషన్ లో ఉంటే..వాగ్ధానాలు చేయడంలో తప్పులేదు.

Read more RELATED
Recommended to you

Latest news