5 రాష్ట్రాల ఎన్నికల వేళ కేంద్ర మంత్రి కపిల పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్( పీఓకే) ని స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యలు చేశారు. 2024లోగా పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. ప్రధాని మోదీ దీని కోసం పని చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా వల్లే కాశ్మీర్ లో ఆర్టికల్ 370, 35 ఏ వంటివి రద్దు అయ్యాయని ఆయన అన్నారు. ప్రస్తుతం యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా ఎన్నికలు వస్తున్న క్రమంలో ఎలక్షన్ స్టంట్ లో భాగంగానే కేంద్ర మంత్రి ఈ వాఖ్యలు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శించే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే గతంలో కూడా కొంతమంది బీజేపీ నేతలు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్యలు చేశారు. గతంలో పార్లమెంట్ లో హోం మంత్రి అమిత్ షా కూడా పీఓకే కూడా భారత్ లో అంతర్భాగమనే అని స్పష్టం చేశారు. మరోవైపు పాకిస్తాన్ లో కూడా ఈ భయం ఉంది. తమ నుంచి పీఓకేని భారత్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అక్కడి రాజకీయ నేతలు కూడా గతంలో ఆందోళన వ్యక్తం చేశారు.