హోలీ పండుగ ని ఎంత అద్భుతంగా జరుపుకోవాలని మీరు చూస్తున్నారా అయితే కచ్చితంగా ఈ బీచ్ లకి వెళ్లాల్సిందే. చాలామంది హోలీ పండుగని వాళ్ళ కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి జరుపుకుంటారు నిజానికి అందరూ కలిసి హోలీ పండుగ చేసుకుంటే ఎంతో బాగుంటుంది.
చాలా మంది హోలీ ఆడటానికి ఇష్టపడతారు రంగు నీళ్లు చల్లుకుంటారు లేదంటే రంగులు జల్లుకుంటారు. కొందరైతే ఆర్గానిక్ కలర్స్ ని తయారు చేసుకుంటారు ఇలా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు హోలీ పండుగ ని ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు మీరు కూడా ఈసారి హోలీ పండుగని అద్భుతంగా జరుపుకోవాలని అనుకుంటున్నారా..? ఎప్పటికీ మర్చిపోలేని హోలీ పండుగని ఈసారి చేసుకోవాలనుకుంటున్నారా అయితే మరి ఈ బీచ్ లకి వెళ్లాల్సిందే.
గోవా బీచ్:
గోవా బీచ్ లో హోలీ చాలా బాగుంటుంది ఇక్కడ క్రిస్మస్ న్యూ ఇయర్ సమయంలోనే కాదు హోలీ సమయంలో కూడా చాలామంది ప్రయాణికులు వస్తారు. భారీ సంఖ్యలో పార్టీ హబ్ కి వెళ్తారు. గోవాలో హోలీ కేవలం పార్టీ లాగ కాదు స్థానికంగా కూడా గోవాలో ఉండేవారు వారి సంప్రదాయం ప్రకారం హోలీని చేసుకుంటారు.
విశాఖపట్నం బీచ్:
విశాఖపట్నంలో కూడా హోలీ బాగుంటుంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి ఎక్కువగా వెళుతుంటారు. ఇది కూడా ఒక మంచి బీచ్ హాలిడే డెస్టినేషన్. బీచ్ కి దగ్గరలో చాలా రిసార్ట్లు కూడా ఉన్నాయి. మీ హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి వైజాగ్ కూడా ఎంతో బాగుంటుంది.
అలీబాగ్:
ముంబై నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో కొంకన్ ప్రాంతంలోని రాయగడ జిల్లాలో ఇది ఉంది ఇక్కడికి కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. చాలా ఈవెంట్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. హోలీ ని ఎక్కడైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మీరు ఇక్కడికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
కోవలం:
కోవలంలో కూడా హోలీ బాగుంటుంది. మీరు అద్భుతంగా హోలీ పండుగను చేసుకోవాలంటే ఇక్కడికి కూడా వెళ్లొచ్చు. ఇక్కడ లైట్ హౌస్ బీచ్, కోవలం బీచ్, హవా బీచ్ వంటి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి మరి స్నేహితులతో కుటుంబ సభ్యులతో వెళ్లి వచ్చేయండి.