ఈ నెల 10న ఢిల్లీలో నిరాహార దీక్షకు సిద్ధమైన ఎమ్మెల్సీ కవిత

-

మహిళా రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్షకు సిద్ధమయ్యారు. ఈనెల 10వ తేదీన ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఒకరోజు దీక్ష చేయనున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:00 వరకు ఈ దీక్ష కార్యక్రమం ఉండనుంది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని డిమాండ్ చేశారు.

దేశవ్యాప్తంగా పనిచేయాలని తెలంగాణ జాగృతి భారత జాగృతిగా మార్చినట్లు తెలిపారు. మహిళా రిజర్వేషన్ ఇస్తామని గత రెండు ఎన్నికల సందర్భంలో చెప్పిన బిజెపి ఆ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. దేశంలో విపక్ష నేతలని దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని ఆరోపించారు. అదానిపై ఈడి, సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయలేదని, సుప్రీం కోర్టు చెబితే ఇప్పుడు అదానిపై విచారణ మొదలవుతుందని అన్నారు. బిజెపి నేతలు చెప్తే నన్ను అరెస్టు చేస్తారా? ఈ మాత్రం దానికి దేశంలో ఏజెన్సీలు ఎందుకు అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news