బ్రేకింగ్ : మల్కాజ్ గిరి ఏసీపీ మీద ఏసీబీ దాడులు..

-

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మల్కాజ్గిరి ఏసిపి నరసింహారెడ్డి ఇంటిపై ఎసిబి దాడులకి దిగింది. గతంలో ఉప్పల్ సీఐగా పనిచేసిన నరసింహారెడ్డి, పలు ల్యాండ్ సెటిల్మెంట్లు, భూ వివాదాల్లో తల దూర్చినట్టు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. నరసింహా రెడ్డి తో పాటు అతని కుటుంబీకులు ఇళ్లల్లో ఏకకాలంలో ఎసిబి సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో ఆరు చోట్ల ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి.

ఏసీపీ న‌ర్సింహారెడ్డి రూ. 50 కోట్ల అక్ర‌మాస్తులు సంపాదించిన‌ట్లు గుర్తించిన ఏసీబీ, హైద‌రాబాద్‌లోని మ‌హేంద్ర‌హిల్స్, డీడీ కాల‌నీ, అంబ‌ర్‌పేట‌, ఉప్ప‌ల్, వ‌రంగ‌ల్‌లో 3 చోట్ల‌, క‌రీంన‌గ‌ర్‌లో 2 చోట్, న‌ల్ల‌గొండ‌లో 2 చోట్ల‌, అనంత‌పూర్‌లో సోదాలు చేస్తున్నారు. మాజీ ఐజీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అల్లుడే ఈ న‌ర్సింహారెడ్డి. ఇక ఇప్పటికే ఏసీబీ తెలంగాణాలో అవినీతి అధికారుల మీద ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఎమ్మార్వో నాగారాజుని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలానే తాజాగా అడిషనల్ కలెక్టర్ నగేష్ కూడా లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇప్పడు ఏకంగా ఏసీపీని ఏసీబీ టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. చూడాలి ఇంకా ఎంత మంది ఏసీబీ వలలో చిక్కుకుంటారో ?

Read more RELATED
Recommended to you

Latest news