దేశం కోసం త్యాగాలు చేసిన కాంగ్రెస్‌ను విమ‌ర్శించ‌డ‌మే బీజేపీ ప‌నిగా పెట్టుకుంది : ఖర్గే

-

కులం, మ‌తం పేరుతో ప్ర‌జ‌ల‌ను బీజేపీ మ‌భ్య‌పెడుతున్న‌ద‌ని కాంగ్రెస్ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే ఆరోపించారు. చ‌త్తీస్‌ఘ‌ఢ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా బుధ‌వారం సుక్మాలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీని ఉద్దేశించి ఖ‌ర్గే మాట్లాడుతూ కాషాయ పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. దేశం కోసం త్యాగాలు చేసిన కాంగ్రెస్‌ను విమ‌ర్శించ‌డ‌మే బీజేపీ ప‌నిగా పెట్టుకుంద‌ని ఎద్దేవా చేశారు. దేశం కోసం మ‌హాత్మా గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ త‌మ ప్రాణాల‌నే త్యాగం చేశార‌ని గుర్తుచేశారు. బీజేపీలో అలాంటి వ్య‌క్తులు ఎవ‌రైనా ఉన్నారా అని ప్ర‌శ్నించిన ఖ‌ర్గే కాషాయ నేత‌లు ఓటు బ్యాంక్ రాజ‌కీయాలు చేస్తార‌ని మండిప‌డ్డారు.

Congress On Mallikarjun Kharge's 1-Year As Party Chief

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్, పవన్ ఖేరాతో సహా ప్రతిపక్ష నాయకులు తమ ఐఫోన్‌లు హ్యాక్ అయినట్లు అలర్ట్ మెసేజ్‌లు రావడంతో వివాదం తలెత్తింది.హ్యాకింగ్ అలర్ట్ వచ్చిన వారి జాబితాలో తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీల నేతలు కూడా ఉన్నారు. అయితే ఈ అంశంపై ఆపిల్ సంస్థ ఒక ప్రకటనను విడుదల చేసింది. తాము బెదిరింపు నోటిఫికేషన్‌ను పంపలేదని, ఇవి నకిలీవి అయి ఉండొచ్చని ఆపిల్ పేర్కొంది. ఈ అలర్ట్ మెసేజ్‌లు రాజకీయ ప్రముఖులకే పరిమితం కాకుండా జర్నలిస్టులు, మేథావులకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news