డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోయిన సింగం విలన్..!

-

సినీ పరిశ్రమలో మరో సారి డ్రగ్స్ కలకలం రేగింది. సింగం సినిమా నటుడు మెల్విన్ డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. సూర్య హీరోగా నటించిన సింగం 2 సినిమా లో నైజీరియా దేశస్థుడు మాల్విన్ అక్రమంగా డ్రెస్ సప్లై చేసే ముఠాకు చెందిన వాడిగా నటించాడు. అయితే నిజజీవితంలోనూ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడటం ఆసక్తి రేపుతోంది. మాల్విన్ బెంగళూరులో డ్రగ్స్ విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయాడు. మాల్విన్ నుండి పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

దాదాపు పదిహేను లక్షల రూపాయల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మాల్విన్ డ్రగ్స్ అమ్ముతూ పట్టుబడటంతో మరోసారి సినీ ఇండస్ట్రీ లో డ్రగ్స్ కలకలం రేగింది. సినిమాల్లో నటించిన మాల్విన్ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరికైనా సరఫరా చేశారా అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక మాల్విన్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో అనేక సినిమాలలో నటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news