Natural Star Nani: ద‌ళ‌ప‌తి కోసం నేచురల్ స్టార్ డేరింగ్ స్టెప్‌.. ఆ పాత్ర చేయ‌డానికి సిద్దం!

-

Natural Star Nani: నేచురల్ స్టార్ నాని..అసిస్టెంట్ డైరెక్టర్‏గా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి.. అష్టాచెమ్మా చిత్రంతో హీరోగా మారాడు. హిట్లు ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా .. వ‌రుసగా సినిమాల్లో న‌టిస్తున్నారు. త‌న న‌ట‌న‌తో ప్ర‌త్యేక ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రేక్షకులను ఆకట్టుకుంటూ న్యాచురల్ స్టార్‏గా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇటీవలే టక్ జగదీష్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన నాని .. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ చిత్రంలో న‌టిస్తున్నారు. త్వ‌ర‌లో ఈ చిత్రం విడుద‌ల కానున్న‌ది. ఇలా స‌క్సెస్ పుల్ హీరోగా కొన‌సాగిస్తునే .. అప్ప‌డప్ప‌డూ త‌న సొంత బ్యాన‌ర్లో సినిమాలు నిర్మాణం చేస్తున్నారు. అయితే.. త‌న కెరీర్‌లో ఇప్పుడు మరోసారి సరికొత్త ప్రయోగం చేయ‌బోతున్నట్టు తెలుస్తుంది.

న‌ట‌న‌కు ప్రాధాన్య‌త ఉన్న ఏ పాత్రనైనా చేసే నాని… ఈసారి విలన్ పాత్ర చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ నేప‌ధ్యంలోనే తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి .. వంశీ పైడిపల్లి కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలో న‌టించ‌నున్నారట‌. ఈ చిత్రాన్ని దిల్ రాజ్ నిర్మించనున్నాడు. విజ‌య్ తొలిసారి నేరుగా తెలుగు చేయ‌డం ఇదే తొలిసారి. ఇటీవలే ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇదిలాఉంటే ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న విలన్ పాత్రలో నాని న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలో వీ సినిమాలో విల‌న్ క్యార్టెర్ చేసి మెప్పించాడు నాని. విమ‌ర్శకుల ప్ర‌సంశ‌లు పొందాడు. ఈ చిత్రంలో విల‌న్ క్యారెక్ట‌ర్ చేసి ప్రేక్ష‌కుల అల‌రించ‌నున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో విజ‌య్ జంట‌గా కియారా అద్వానీ లేదా రష్మిక మందన్నా న‌టించ‌న్నారట‌. ఇక ఈ మూవీ రెగ్యూలర్ షూట్‌ అక్టోబర్ 27 నుంచ ప్రారంభం కానున్న‌ట్లు చిత్ర‌సీమ‌లో టాక్ న‌డుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news