కోల్ కతాలో మమతా బెనర్జీ మెగా ర్యాలీ.. ఎన్‌ఆర్‌సీపై నిరసన..

-

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక(ఎన్‌ఆర్‌సీ)లను వ్యతిరేకిస్తూ ఈశాన్య రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీలను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కోల్‌కతాలో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. కోల్‌కతాలోని అంబేడ్కర్ విగ్రహం నుండి జొరసాంకో వరకు దాదాపు 7కి.మీ వరకు వేలాదిమంది కార్యకర్తలతో ఆమె ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక‌ ఈ విషయంపై ఆమె ఈ రోజు ట్వీట్ చేశారు.

‘రాజ్యాంగ పరిధిలో శాంతియుతంగా ఈ ప్రజా ఉద్యమంలో పాల్గొందాం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కదలి రండి. రాజ్యాంగ విరుద్ధమైన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలపై కోల్ కతాలో మెగార్యాలీ నిర్వహిస్తున్నాం. అని మమతా బెనర్జీ ట్వీట్లు చేశారు. కాగా, ఎన్‌ఆర్‌సీని బెంగాల్‌లో అమలుచేసే ప్రసక్తే లేదని ఇదివరకే మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్ నుంచి ఏ ఒక్కరిని శరణార్థిగా బయటకు పంపించమని తెగేసి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news