చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన మమతా బెనర్జీ..

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులా ఉందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు. టీడీపీ హయాంలో ఏదైనా తప్పు జరిగితే మాట్లాడాలని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. కానీ కక్షపూరితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రెండు రోజుల క్రితం చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

BJP Predicts Mamata Banerjee's Government In West Bengal Will Collapse  Within Months

ఇదిలా ఉంటే, చంద్రబాబు అరెస్ట్‌ను రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఎంపీ, పార్టీ అధికార ప్రతినిధి మనోజ్‌ ఝా ఖండించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులపై విపరీత ధోరణితో వెళ్లడం భారత రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌గా మారిందని అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను కటకటాల వెనక్కి నెట్టడం ప్రధాని మోదీ, హెచ్‌ఎం అమిత్ షా సంప్రదాయమని.. కొత్త శిష్యులు కూడా దానిని ఫాలో అవుతున్నారని మనోజ్ ఝా అన్నారు. ప్రత్యర్థులను జైలు పెట్టడాన్ని మోదీ, అమిత్ షాల నుంచి జగన్ నేర్చుకున్నారని.. అలాంటి చర్యలకు ఎక్కువ కాలం ఉండదని అన్నారు. చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి మాత్రమే కాదని.. ఆధునిక ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని చెప్పారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news