కాంగ్రెస్ కు మమతా బెనర్జీ షాక్.. అసలు యూపీఏ ఎక్కడ ఉందంటూ కామెంట్స్

-

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు బీజేపీకి బలైన ప్రత్యర్థిగా మారాలని త్రుణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ భావిస్తోంది.  అందుకు తగ్గట్లుగానే భావ సారుప్యత ఉన్న పార్టీలను ఒక్కతాటిపైకి తీసుకురావడానికి దీదీ ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లు పశ్చిమ బెంగాల్ కే పరిమితమైన త్రుణమూల్ కాంగ్రెస్ ను గోవా, మేఘాలయ, త్రిపుర, అస్సాం, యూపీలో విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది.  తాజాగా ఈరోజు ముంబైలో శివసేన, ఎన్సీపీ పార్టీల నాయకులు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్, శరద్ పవార్ లను కలిశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.

తాజాగా ఈ సమావేశాల అనంతరం దీదీ కాంగ్రెస్ పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈదేశంలో యూపీఏ ఎక్కడ ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. యూపీఏకు భాగస్వామ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి దీదీ సవాల్  విసిరారు. బీజేపీ ఫాసిజానికి వ్యతిరేఖంగా పోరాటం చేాయాల్సిందే అని.. దాని కోసమే శరద్ పవార్, ఆధిత్యఠాక్రేలను కలిశానని మమతా బెనర్జీ వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేఖంగా గట్టి ప్రత్యామ్నాయం రూపొందించడానికి భావసారుప్యత ఉన్న పార్టీలతో సమావేశం అవుతున్నట్లు ఆమె వెల్లడించింది. మమత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని పక్కన పెట్టి కొత్త కూటమిని ఏర్పాటు చేసే ఉద్దేశాన్ని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news