ఇల్లెందులో దారుణం : అర్ధరాత్రి యువతిపై దాడి.. రక్తంతో పోలీసులకు !

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురంలో దారుణం చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువతి పై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. గురువారం అర్ధరాత్రి ఓ యువతిపై కత్తితో 23 ఏళ్ళ యువకుడు దాడి చేశాడు. కత్తితో దాడి చేసి ఆ యువతిని ముళ్ల పొదల్లో పడేసిన యువకుడు అక్కడి నుండి వెళ్లిపోబోయాడు. అయితే అర్దరాత్రి సమయంలో చేతులకు రక్తం అంటి ఉండగా పెట్రోలింగ్ పోలీసులకు యువకుడు తారసపడ్డాడు.

అయితే అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా యువతిపై దాడి చేసినట్లు పేర్కొన్నాడు. దీంతో హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ముళ్ల పొదల్లో అపస్మారక స్థితిలో పడివున్న యువతిని ఇల్లందు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి యువతి తరలించారు. అసలు ఈ దాడికి కారణం ఏమిటి అనేది తెలియాల్సి ఉంది. ప్రేమ కోణం ఏమైనా ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news