నాంపల్లిలో దారుణం.. కూల్‌ డ్రింక్‌ దొంగిలించాడని చితక్కొట్టి కారం చల్లాడు

-

హైదరాబాద్‌ నాంపల్లిలో అమానుషం చోటుచేసుకుంది. కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ దొంగిలించాడంటూ ఓ బాలుడి పట్ల షాపు యజమాని కృష్ణ దారుణంగా ప్రవర్తించాడు. బాలుడిని తన ఇంటికి తీసుకెళ్లి చితక్కొట్టాడు. దుస్తులు తీసి కాళ్లు, చేతులు కట్టేసి కారం చల్లాడు. అనంతరం మళ్లీ కొడుతూ వీడియోలు చిత్రీకరించి పైశాచిక ఆనందం పొందాడు.

తర్వాత ఆ వీడియోలను తెలిసిన వారికి పంపడంతో చివరికి విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు హబీబ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. షాపు యజమాని కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news