హిట్ 2 ఓటీటీ అప్డేట్ వైరల్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..!

-

ప్రముఖ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో యంగ్ హీరో అడవి శేష్ తెరకెక్కించిన చిత్రం హిట్ 2.. హిట్ సినిమా కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా భారీ వసూలను క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాలలో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ మొత్తంలో వసూళ్లు రాబట్టింది. హిట్ 2 సినిమాతో మరొకసారి అడవి శేష్ సక్సెస్ ను దక్కించుకున్నాడు. ఇకపోతే అమెజాన్ లో ఈ సినిమాను జనవరి మొదటి వారంలో అందుబాటులో ఉంచే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 2వ తారీకున విడుదలైన ఈ సినిమా .. నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసే విధంగా అమెజాన్ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది.

ఇకపోతే నాని నిర్మాణంలో వచ్చిన హిట్ 2 కి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో అతి త్వరలోనే హిట్ 3 కూడా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చారు. హిట్ 3 సినిమాలో నాని ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడు. అంతే కాదు ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా శైలేష్ కొలను ఈ సినిమాను రెండు సినిమాల కంటే అద్భుతంగా తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఇదిలా ఉండగా హిట్ సినిమా హిందీలో రీమేక్ అయి నిరాశపరిచింది. అందుకే హిట్ 2 సినిమాని కూడా హిందీలో రీమేక్ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకే హిందీలో ఈ సినిమాను రీమేక్ చేయకుండా సౌత్ ఇండియాలో మాత్రమే అన్ని భాషలలో విడుదల చేసి మరింత సక్సెస్ పొందాలి అని దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా హిట్ 3 తర్వాత హిట్ ఫోర్, ఫైవ్, సిక్స్, సెవెన్ సీక్వెల్స్ కూడా ఉంటాయి అని.. హిట్ సెవెన్ లో మొత్తం 7 మంది హీరోలు ఉంటారని కూడా నాని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news