దారుణం..మైనర్ ను ఇంట్లో పనికి పెట్టుకుని అరచాకం !

-

ఆడవాళ్ళ రక్షణ కోసం ఎన్ని చట్టాలు చేస్తున్నా మృగాళ్ళకు ఏమాత్రం భయం వేయడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఇంటి పనులు సరిగా చేయడం లేదంటూ రాజశేఖర్ అనే వ్యక్తి మైనర్ బాలికను శారీరకంగా వేధించాడు. ఇంటి పనులు, తన తండ్రికి సపర్యలు కోసం రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి తన ఇంటికి తీసుకెళ్లిన అతను శారీరక వేధింపులకు పాల్పడ్డాడు.

child rape cases
 

ఆ వేధింపులు తాళలేని అమ్మాయి నాలుగు గోడల మధ్య నరకయాతన అనుభవించింది. అయితే ఈ విషయాన్ని ఆమె పోలీసుల దృష్టికి తీసుకు వెళ్ళింది. దీంతో రంగంలోకి దిగిన పోలీస్, రెవెన్యూ, ఐసీడీఎస్ బృందాలు ఆపరేషన్ స్మైల్ లో భాగంగా ఆ బాలికను రక్షించారు. రాజశేఖర్ అనే వ్యక్తి తనను ఏ విధంగా చిత్రహింసలకు గురిచేశాడో అధికారుల ముందు గోడును వెళ్లబోసుకుంది. నిందితునిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు బాలకార్మిక హక్కుల చట్టం కింద కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news