“కరోనా దేవి”కి పూజలు.. అందుకేనట.!

-

ప్రపంచమంతా కరోనా వైరస్ కి వణికిపోతున్నారు. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే దీన్ని అరికట్టేందుకు వైద్య సిబ్బంది, ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో లక్షల మంది మరణించారు. ఇంకా ఈ మహమ్మారి ఎంతమందిని పొట్టనపెట్టుకుంటుందో అర్ధం కావట్లేదు. ఈ నేపధ్యంలో కరోనా వైరస్‌ను అనిలన్‌ అనే ఓ వ్యక్తి దేవతగా పూజించడం సంచలనంగా మారింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. దీనిపై ఆయన స్పందిస్తూ..వైరస్ కట్టడికి ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసు, మీడియా, శాస్త్రవేత్తల బాగు కోసం “కరోనా దేవి”కి పూజలు చేస్తున్నానని తెలిపాడు. ఆయన ఏర్పాటు చేసిన సార్స్‌ కరోనా ప్రతిరూపం కనిపించే ఫోటోస్‌ను పెట్టుకుని ‘కరోనా దేవి’కి పూజాలు చేసే వార్తలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌‌గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news