సెల్ ఫోన్ కోసం రైలు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడు..!

-


ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు. కోట్లాస్తి కూడా ప్రాణం ముందు పిచ్చికాగితం కిందే లెక్క. డబ్బులు ప్రాణాన్ని నిలబెట్టలేవు. ఎంతమంది ఆత్మీయులు ఉన్నా ప్రాణాన్ని కాపాడలేరు. ఈ ప్రాణం ఉన్నంత వరకే డబ్బైనా, వస్తువైనా, ఆత్మీయులైనా. ఇప్పుడు ఈ ఉపోద్ఘాంతం అంతా ఎందుకు అంటే.. ఓ సాడ్ స్టోరీ మనం చదవాల్సిందే.

మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన చేతన్ అహిర్ రావు డాక్టర్. వయసు 35. ముంబైలో ఉంటున్నాడు. లోకల్ ట్రెయిన్ లో థానే లోని దివా జంక్షన్ కు వెళ్తున్నాడు. రైలు ఫుట్ బోర్డ్ దగ్గర నిలబడ్డాడు. దివా కంటే ముందు కల్వా స్టేషన్ కు ట్రెయిన్ వచ్చింది. ట్రెయిన్ ఆగి వెళ్లిపోతున్న సమయంలో ఫుట్ బోర్డ్ దగ్గర నిలబడి ఫోన్ ను చెక్ చేస్తున్నాడు అహిర్. ఇంతలోనే ప్లాట్ ఫాం మీద నిలుచున్న ఓ వ్యక్తి వచ్చి అహిర్ ఫోన్ లాక్కొన్నాడు. దీంతో కంగుతిన్న అహిర్ ఏమాత్రం ఆలోచించకుండా ఫోన్ కోసం రైలు నుంచి దూకాడు. దీంతో అహిర్ రైలు పట్టాలపై పడిపోయాడు. అహిర్ కు తీవ్ర గాయాలు కాగా.. వెంటనే రైల్వే సిబ్బంది సమీప ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ అహిర్ మృతి చెందాడు.

ముందుగా అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడి మొబైల్ కోసం వెతకగా దొరకలేదు. దీంతో ఆకోణంలో విచారణ చేసిన పోలీసులు తన మొబైల్ కోసమే అహిర్ రైలు నుంచి దూకాడని తెలిసింది. వెంటనే కల్వా స్టేషన్ లో ఉన్న సీసీటీవీ కెమెరాను పరిశీలించగా.. అహిర్ మొబైల్ ను ఓ దుండగులు కొట్టేయడం రికార్డయింది. అనంతరం అహిర్ రావు రైలు నుంచి కిందికి దూకిన దృశ్యాలు అందులో రికార్డయ్యాయి. దీంతో పోలీసులు అహిర్ ఫోన్ కొట్టేసిన అజయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news