రోడ్డు మీద కూరగాయలమ్మిన స్టార్ హీరోయిన్..!

-

అసలే స్టార్ హీరోయిన్ అందునా అక్కినేని కోడలిగా కొత్త భాధ్యత మీద వేసుకుంది. మరి అలాంటి పిల్ల రోడ్డు మీద కూరగాయలు అమ్మితే ఎలా ఉంటుంది. అయ్యే రామా ఇదేం విచిత్రం అనుకోవచ్చు. క్రేజీ హీరోయిన్ సమంత నిజంగానే జామ్ బజార్ లో సమంత వెజిటబుల్స్ సేల్ చేసింది. కూరగాయలమ్మే మహిళ దగ్గరకు వెళ్లి ఆమె పర్మిషన్ తో కూరగాయలన్ని అమ్మేసింది.

సమంత లాంటి భామ కూరగాయలమ్మితే ఇక ఎవరైనా కొనకుండా ఉంటారా అవసరం ఉన్నా లేకుండా రేటుతో సంబంధం లేకుండా వచ్చి సమంత దగ్గర కూరగాయలు కొనేశారు. ఎప్పుడు మంచి పనులకు ముందుండే సమంత తను స్థాపించిన ప్రత్యూషా ఫౌండేషన్ కోసం అప్పుడప్పుడు ఇలా విరాళాలు సేకరిస్తుంది. సమంత బ్రాండ్ తో ఆ కూరగాయలన్ని అమ్మేసిందట.

పెళ్లి తర్వాత ఏ హీరోయిన్ కైనా క్రేజ్ తగ్గుతుంది. కాని సమంత విషయంలో అది డబుల్ అయ్యిందని చెప్పాలి. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అమ్మడు తన స్టార్ ఇమేజ్ కొనసాగిస్తుంది. చూస్తుంటే టాలీవుడ్ లో సమంత పెళ్లి తర్వాత సరికొత్త రికార్డ్ సృష్టిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news