బరువు పెరిగిందని భార్యకు ట్రిపుల్ తలాక్‌

-

ప్రభుత్వ ట్రిపుల్ తలాక్ ను నియంత్రించినా.. కోర్టులు ట్రిపుల్ తలాక్ చెల్లవని చెప్పినా.. కొన్ని చోట్ల ఇంకా ఈ తరహా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అమాయక మహిళల జీవితాలకు చెంపపెట్టుగా నిలుస్తూనే ఉన్నాయి.  తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. భార్య లావు అయిందని ట్రిపుల్‌ తలాక్‌ చెప్పాడు ఓ భర్త. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.

‘‘నాకు ఎనిమిదేళ్ల క్రితం సల్మాన్‌తో వివాహమైంది. 7 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. నెల క్రితం నా భర్త నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. ట్రిపుల్‌ తలాక్‌ కోసం నా భర్త విడాకుల నోటీసులు పంపాడు. దానికి ఆయన చెప్పిన కారణం నన్ను షాక్‌కు గురిచేసింది. నేను లావు అయ్యానని అందుకే.. విడాకులు ఇస్తున్నానని తెలిపాడు’’ అని బాధితురాలు పేర్కొంది.

.

Read more RELATED
Recommended to you

Latest news