HBD PK: తన కెరీర్ లో రీమేక్ చేసిన చిత్రాలివే..!

-

ఈమధ్య కాలంలో చాలామంది రీమేక్ సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కాబట్టి ఆయన సినీ కెరియర్ లో ఎన్ని సినిమాలు రీమేక్ చేయబడ్డాయో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..

వకీల్ సాబ్:Vakeel Saab Review : 'వకీల్ సాబ్' మూవీ రివ్యూ | News Orbitఅమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సినిమా రీమేక్ ను తెలుగులో వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇమేజ్ కి తగ్గట్టుగా పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించిన ఈ సినిమా మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేస్తుంది.

కాటమరాయుడు:Katamarayudu
తమిళంలో హీరో అజిత్ నటించిన సూపర్ హిట్ సినిమా వీరం సినిమాకు రీమేక్ గా కాటమరాయుడును తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది.

గోపాల గోపాల:Gopala Gopala: A faithful remake with no room for creativity - Hindustan Timesహిందీలో అక్షయ్ కుమార్ ముఖ్యపాత్రలో నటించి తెరకెక్కించిన ఓ మై గాడ్ సినిమాకు రీమేక్ గా గోపాల గోపాల చిత్రాన్ని తెరకెక్కించారు..

గబ్బర్ సింగ్:గబ్బర్ సింగ్‌‌కు 8 ఏళ్లు: అప్పుడు బాక్సాఫీస్, ఇప్పుడు ట్విట్టర్ బెండు తీస్తూ, 34 మినిట్స్ లోనే రచ్చ | Gabbar Singh completes 8 years: Pawan Kalyan movie rocks in Twitter ...సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ సినిమాను తెలుగులో రీమేక్ చేసి గబ్బర్ సింగ్ గా తెరకేక్కించారు. ఇందులో మన తెలుగు నేటివిటికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేర్పులు చేసి కథను తలకెక్కించడం జరిగింది.

తీన్ మార్:Watch Teenmaar Movie Online for Free Anytime | Teenmaar 2011 - MX Player
జయంత్ సి పరాంజీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తీసిన తీన్ మార్  హిందీలో సైఫ్ అలీఖాన్ హీరోగా నటించిన లవ్ ఆజ్ కల్ సినిమాకు రీమేక్.

అన్నవరం:Annavaram Telugu Movie | Clapnumber
తమిళ్లో విజయ్ హీరోగా నటించిన తిరుపాచి చిత్రాన్ని తెలుగులో భీమనేని శ్రీనివాస్ రావు దర్శకత్వంలో అన్నవరంగా రీమేక్ చేశారు.

ఖుషీ:Kushi | Watch Full HD Telugu Movie Kushi 2001 Onlineతమిళంలో ఎస్. జె . సూర్య దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కించిన ఖుషి సినిమాను, తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా అదే టైటిల్ తో తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

ఇక వీటితోపాటు తమ్ముడు, సుస్వాగతం , గోకులంలో సీత , అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి , భీమ్లా నాయక్ వంటి సినిమాలన్నీ రీమేక్ చేసి తెరకెక్కించారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news