ముగ్గురు భార్య‌లు ఉన్న ఆ వ్య‌క్తికి ఇంకో భార్య కావాల‌ట‌.. కానీ ఒక ష‌ర‌తు..!

-

బ‌హు భార్యత్వం అనేది ఒక‌ప్పుడు ఉండేది. చాలా వ‌ర‌కు అంత‌రించిపోయింది. కానీ ఇప్ప‌టికీ కొన్ని చోట్ల కొంద‌రు దాన్ని అనుస‌రిస్తున్నారు. అయితే ఆ వ్య‌క్తి కూడా అలాగే ముగ్గుర్ని ఇప్ప‌టి వ‌ర‌కు వివాహం చేసుకున్నాడు. కానీ అత‌ను ఇంకో భార్య కోసం చూస్తున్నాడు. అందుకు అత‌నికి త‌న ముగ్గురు భార్య‌లు కూడా స‌హాయం చేస్తుండ‌డం విశేషం.

man has 3 wives still looking for 4th one

పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌కు చెందిన 22 ఏళ్ల అద్నాన్‌కు ముగ్గురు భార్య‌లు ఉన్నారు. త‌న 16వ ఏట స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడే అత‌నికి వివాహం జ‌రిగింది. త‌రువాత 20వ ఏట రెండో వివాహం చేసుకున్నాడు. గ‌తేడాది ముచ్చ‌ట‌గా మూడో పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇప్పుడు నాలుగో భార్య కావాల‌ని ఎదురు చూస్తున్నాడు. అందుకు అత‌ని భార్య‌లు కూడా స‌హాయం చేస్తున్నారు. ఇక నాలుగో భార్య పేరు ఆంగ్ల అక్ష‌రం S తో ప్రారంభం కావాల‌ని ష‌ర‌తు పెట్టాడు. ఎందుకంటే త‌న ముగ్గురు భార్య‌ల పేర్లు.. షుంబ‌ల్‌, షుబానా, షాహిదా.. అని S తోనే ప్రారంభ‌మ‌వుతాయి. అందుక‌నే అదే అక్ష‌రం ప్రారంభంతో పేరు క‌లిగిన మ‌హిళ కోసం అత‌ను ఎదురు చూస్తున్నాడు.

ఇక అత‌నికి 5 మంది పిల్ల‌లు ఉన్నారు. మొద‌టి భార్య‌తో ముగ్గుర్ని క‌న్నాడు. షుబానాతో ఇద్ద‌ర్ని క‌న్నాడు. షుబానాకు చెందిన ఇద్ద‌రు పిల్ల‌ల్లో ఒక‌ర్ని షాహిదాకు పెంచుకునేందుకు దత్త‌త ఇచ్చాడు. ఇక వీరంద‌రూ క‌ల‌సి ఒకే ఇంట్లో ఉంటారు. అందులో మొత్తం 6 బెడ్ రూమ్స్ ఉంటాయి. ఒక డ్రాయింగ్ రూం, ఒక స్టోర్ రూం కూడా ఉంటాయి. త‌న మొద‌టి భార్య వ‌ల్ల అత‌నికి ఆస్తి కూడా క‌ల‌సి వ‌చ్చింది. అందువ‌ల్ల వారి కుటుంబానికి ఖ‌ర్చుల‌కు కూడా ఏ ఢోకా లేదు. నెల‌కు వారికి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతాయి.

కాగా త‌న ముగ్గురు భార్య‌లు త‌న‌ను బాగా చూసుకుంటార‌ని, వారిలో వారికి ఎలాంటి గొడ‌వ‌లు లేవ‌ని అత‌ను చెబుతున్నాడు. ముగ్గురూ క‌ల‌సి క‌ట్టుగా ఉండి, అన్ని ప‌నులు చేసుకుంటార‌ని, అందువ‌ల్ల ఎలాంటి గొడ‌వ‌లు లేకుండా సంసారం స‌జావుగా సాగుతుంద‌ని అత‌ను తెలియ‌జేశాడు. అవును.. అంద‌రూ క‌ల‌సి ఉన్నారు క‌నుక ఓకే.. లేదంటే.. అత‌ను అన్ని వివాహాలు చేసుకునేవాడు కాదు, ఇంకో వివాహం కోసం ప్ర‌స్తుతం ఎదురు చూసేవాడు కూడా కాదు. ఏది ఏమైనా.. పురుష పుంగ‌వుల‌కు ఇత‌న్ని చూస్తే నిజంగా ఈర్ష్య క‌లుగుతుంది క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news