ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రత ఇప్పుడు భయపెడుతుంది. అక్కడ 420 కరోనా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రానికి చెప్పినా సరే అది నిజం కాదు అనే విషయం అర్ధమవుతుంది. ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, నెల్లూరు, కర్నూలు, కృష్ణా జిల్లాల్లో కేసులు అత్యధికంగా నమోదు అవుతున్నాయి.
తాజాగా ప్రకాశం జిల్లాలో నమోదు అయిన కేసు ఏపీ ప్రభుత్వాన్ని భయపెట్టింది. ఒంగోలు వ్యక్తికి కరోనా బయటపడింది. ఆ వ్యక్తికి బయటి వాళ్ళతో ఎలాంటి సంబంధం లేదు. ఢిల్లీ మర్కాజ్ యాత్రికులను కలవలేదు, విదేశాల నుంచి వచ్చిన వారితో ఎలాంటి సంబంధాలు లేవు. ఇంట్లో కూర్చునే ఉన్నా కరోనా సోకింది అతనికి. దీనితో ఏపీలో కరోనా వ్యాప్తి మరో దశకు వెళ్ళిందా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యక్తికి ఒంగోలులో నెగటివ్ రిపోర్ట్ రాగా నెల్లూరులో పాజిటివ్ వచ్చింది. దీన్ని చూసి వైద్యులు కూడా షాక్ అయ్యారు. అసలు ఎవరిని కలవకుండా కరోనా వైరస్ ఏ విధంగా వచ్చిందో అర్ధం కావడం లేదు. కర్ణాటక, ఏపీ సరిహద్దుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అటు కర్ణాటకలో కూడా ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయి. దీనితో అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలను బయటకు రావొద్దని కోరుతున్నారు.