ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఊహించని షాక్ తగిలింది. మంత్రి ఆదిమూలపు సురేష్ కాన్వాయ్ ఢీ కొని ఓ వ్యక్తి మరణించాడు. రోడ్డు పై వెళుతున్న ఓ బైక్ ను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కు చెందిన.. కాన్వాయ్ ఓ కారు ఢి కొట్టింది. ఈ సంఘటన లో ఓ యువకుడు మరణించాడు. 38 సంవత్సరాలు మహేష్ అనే వ్యక్తి మరణించగా… అతని భార్య కు తీవ్ర గాయాలు అయ్యాయని సమాచారం అందుతోంది.
ఈ ప్రమాద సంఘటన ప్రకారం జిల్లా లోని పెద్దర వీడు మండలం.. గొబ్బూరు సమీపంలో చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. ఈ ప్రమాదం జరిగిన వెంటనే.. అక్కడే ఉన్న స్థానికులు అతని భార్యను ఆస్పత్రి కి తరలించారు. ఇక ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే.. ఈ ప్రమాదం జరిగినప్పుడు.. మంత్రి ఆదిమూలపు సురేష్ కన్వాయ్ లోనే ఉన్నారా.. లేదా.. అనేది తెలియాల్సి ఉంది.