వైసీపీ కీలక నేత, రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి.. గురించి రెండు తెలుగు రాష్ట్రలలో ఉండరు. సీఎం జగన్ జైలు కు వెళ్లిన నుంచి ఇప్పటి వరకు ఆయన వెంట కొనసాగారు ఎంపీ విజయ సాయిరెడ్డి. అంతేకాదు.. వైసీపీ తరఫున చంద్రబాబుపై ఎప్పుడూ… ఎటాకింగ్ గా ఉంటారు. ట్విట్టర్ వేదికగా.. ఎప్పుడూ ఎదో ఒక దానిపై చంద్రబాబు ను టార్గెట్ చేస్తూనే ఉంటారు. అయితే.. ఇవాళ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి రెడ్డి పుట్టిన రోజు.
ఈ నేపథ్యంలో.. ఆమె కు తన స్టైల్ లో విజయసాయిరెడ్డి పుట్టిన రోజు శుభా కాంక్షలు చెప్పారు. ”సీఎం శ్రీ వైఎస్ జగన్ గారి సతీమణి శ్రీమతి వైఎస్ భారతి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ రాముడికి సీతమ్మ తల్లి లాగా జగన్ గారికి ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తున్న వైఎస్ భారతి గారు మరెన్నో మధురమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.