బ్రెజిల్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆటలో ఓడిపోయినందుకు తనను చూసి నవ్వారని ఓ వ్యక్తి ఏకంగా ఏడుగురిని కాల్చి చంపాడు. వాళ్లందరిని వరుసలో నిలబెట్టి మరీ అతిక్రూరంగా హతమార్చాడు. అసలేం జరిగిందంటే..?
సినోప్ నగరానికి చెందిన ఎడ్గర్ రికార్డో డి ఒలివిరా తన స్నేహితుడు రెబిరోతో కలిసి మంగళవారం స్థానిక పూల్ హాల్‌కు వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తితో 4 వేల రియాస్ (బ్రెజిల్ కరెన్సీ)కు పందెం కాసి పూల్ గేమ్‌లో ఓడిపోయాడు. మళ్లీ అదే వ్యక్తితో పందెం కాసి రెండోసారీ ఓడిపోయాడు.
మళ్లీ మళ్లీ ఓడిపోవడంతో పూల్ హాల్‌లో ఉన్న కొందరు అతడిని చూసి నవ్వారు. కోపోద్రిక్తులైన ఒలివిరా, అతడి స్నేహితుడు దారుణానికి పాల్పడ్డారు. రెబిరో గన్‌తో బెదిరించి అక్కడున్నవారిని వరుసలో నిలబెట్టగా.. ఒలివిరా వారిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పూల్ యజమాని సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.