ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడు సైఫ్ అరెస్ట్‌

-

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకతీయ మెడికల్ కళాశాల పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాత్నం కేసులో నిందితుడు సైఫ్​ను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

మరోవైపు ప్రీతి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఎక్మో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని..కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగ్గా ఉందని వెల్లడించారు. ఇవాళ విద్యార్థినిని రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. ఆమె తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.

మరోవైపు ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రీతి ఆరోగ్యంపై మంత్రులు, వైద్యులది తప్పుడు ప్రచారని ఆమె బాబాయ్ రాజ్ కుమార్ ఆరోపించారు. ‘ఘటన తీవ్రత తగ్గించడానికే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రీతి ఆరోగ్యంలో ఎలాంటి మెరుగుదల లేదు.
నిందితుడు సైఫ్ హోంమంత్రి బంధువు. అందుకే ఘటనను తప్పుడు దారి పట్టిస్తున్నారు.’ – రాజ్ కుమార్, ప్రీతి బాబాయ్

Read more RELATED
Recommended to you

Latest news