చుట్టూ మన ప్రపంచంలో నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. కొన్నింటిని మనం అలా చూస్తూ వెళ్లిపోతాం. కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాపాయంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురు చూడడం కూడా జరుగుతుంటుంది. అలాంటప్పుడు చాలా మంది కొయ్యబొమ్మల్లా నిలుచుంటారు కానీ.. చేతనైనంతగా ఏదో ఒక సహాయం చేద్దామని ఎవరూ అనుకోరు. ఇక ఇది సెల్ఫీలు, వీడియోల యుగం కనుక అలాంటి ఘటనలను చాలా మంది ఫొటోలు, వీడియోలు తీసే యత్నం చేస్తారు. అది మామూలే. కానీ ఆ వ్యక్తి మాత్రం అలా అనుకోలేదు. వెంటనే రంగంలోకి దిగి సహాయం చేశాడు. ఓ బాలుడి ప్రాణాలను కాపాడాడు.
ఓ బాలుడు భవనం పైకప్పు పట్టుకుని వేళ్లాడుతున్నాడు. ఏ క్షణంలో అయినా అతను కిందకు పడిపోవచ్చు. అలా జరిగితే అతని ప్రాణాలు పోతాయి. కొంత సేపు ఆలస్యం అయి ఉంటే నిజంగానే అతని ప్రాణాలు పోయేవే. కానీ ఓ వ్యక్తి మాత్రం చూస్తూ ఊరుకోకుండా వెంటనే రంగంలోకి దిగి చక చకా ఆ భవనం పైకి పైపులు పట్టుకుని వెళ్లాడు. వెంటనే ఆ బాలున్ని కింద పడకుండా పైకి లాగి రక్షించాడు. ఏ తల్లి బిడ్డో కానీ, అతని సాహసం మాత్రం అద్బుతం.. ఒక్కనిమిషం లేటు చెయ్యకుండా వెంటనే స్పందించిన తీరుకి సల్యూట్ కొట్టాల్సిందే.
చుట్టూ ఎంతో మంది వీడియోలు తీసుకుంటూ అలాగే చూస్తున్నారు. కానీ ఒక్కరు కూడా ఆ బాలున్ని రక్షించే ప్రయత్నం చేయలేదు. చివరకు ఓ వ్యక్తి సాహసం చేశాడు. దీంతో నెటిజన్ల దృష్టిలో అతను హీరో అయ్యాడు. ఈ క్రమంలో ఆ సమయంలో తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.