ప్రజలతో మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్సీకి చెంప దెబ్బ

-

మహారాష్ట్రలో ఓ మహిళా ఎమ్మెల్సీకి ఘోర అవమానం ఎదురైంది. ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి అకస్మాత్తుగా వచ్చి చెంపదెబ్బ కొట్టాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. అసలేం జరిగిందంటే..?

కాంగ్రెస్​ పార్టీకి చెందిన ప్రజ్ఞా సాతవ్​పై ఓ వ్యక్తి చేయి చేసుకున్నాడు . బుధవారం రాత్రి ప్రజలతో ప్రజ్ఞ మాట్లాడుతుండగా అక్కడకు వచ్చిన ఓ 40 ఏళ్ల వ్యక్తి.. ఆమెను లాగి అనంతరం చెంపపై బలంగా కొట్టాడు. దీంతో ఆ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ. అతడిపై చర్యలు తీసుకోవాలని వారిని కోరారు.

హింగోలి జిల్లా పర్యటనలో ఉండగా ఎమ్మెల్సీ ప్రజ్ఞా సాతవ్​పై ఈ దాడి జరిగింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలు దివంగత కాంగ్రెస్ నేత రాజీవ్ సాతవ్ భార్య.

Read more RELATED
Recommended to you

Latest news