స్ఫూర్తి: స్తొమత లేనివాళ్ళ ఆకలిని తీర్చాలని రెండు రూపాయలకే దోశలు అమ్ముతున్న అతన్ని చూస్తే మెచ్చుకుంటారు..!

-

ఎక్కువ మంది వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుంటారు. తమకు నచ్చిన వ్యాపారంతో నాలుగు రాళ్లు వెనకేయ్యాలని అందరికీ ఉంటుంది. కానీ నిజానికి ఈయన చేసే పని మాత్రం ఎంతో గొప్పగా ఉంది. ఇటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలి. మన దక్షిణ భారతదేశంలో ఎక్కువగా దోశ ఇడ్లీలు తింటూ ఉంటాము.

తమిళనాడులో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. తమిళనాడులో కూడా ఇడ్లీ దోశ బాగా దొరుకుతుంటాయి. మామూలుగా చిన్న హోటల్లో అయితే తక్కువ ధర ఉంటాయి. అదే పెద్ద హోటల్లకి వెళ్తే ధర ఎక్కువ ఉంటుంది. ఎక్కడైనా సరే కనీసం 20 రూపాయలు అయినా ఒక ప్లేట్ ఉంటుంది. కానీ తమిళనాడులోని తిరుచ్చి కి చెందిన చిన్న తంబీ మాత్రం రెండు రూపాయలకు దోస, మూడు రూపాయలకు ఇడ్లీ అమ్ముతున్నాడు.

ఇలా 600 నుంచి 800 రూపాయలు రోజుకి సంపాదిస్తున్నాడు. రాత్రి పూట అయితే ఇడ్లీ, పరోటా, ఆమ్లెట్స్ వంటివి కూడా అమ్ముతాడు. గత ఆరు సంవత్సరాలుగా చిన్న తంబీ వ్యాపారాన్ని చేస్తున్నాడు. అయితే ఇంత తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నాడు..? అతనికి ఏమి లాభం అనే ప్రశ్న ఈపాటికి మీలో కలిగి ఉంటుంది.

నిజానికి వ్యాపారం కంటే కూడా స్తోమత లేక ఖాళీకడుపుతో నిద్రపోయే వాళ్లకి కూడా ఆహారం అందాలని అనుకుంటున్నాడు. ఖాళీకడుపుతో ఎవరు నిద్ర పోకూడదు అని ఏ పేద వాళ్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఈ దుకాణాన్ని నడుపుతున్నాడు. అయితే పది రూపాయల తో వచ్చి కడుపునిండా తిని వెళ్లే వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా ఉంటుందని అతను అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news