ఏపీకి రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది అల్పపీడనం ఉత్తర తమిళనాడు వద్ద తీవ్రవాయుగుండంగా తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ వాయుగుండం ప్రభావం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కూడా ఉండే అవకాశం ఉందని… కాబట్టి మత్స్యకారులు అలర్ట్ గా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తీరం వెంబడి 70 కిలోమీటర్ల వేగంతో ఏపీ వ్యాప్తంగా ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో దక్షిణ కోస్తా అలాగే రాయల సీమలో రెండు రోజులపాటు భారీ వర్షాలు ఉన్నట్లు పేర్కొంది వాతావరణ శాఖ. ఇక ఈ వాయుగుండం నేపథ్యంలో చేపల వేటను నిషేధిస్తే గుంటూరు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల ఆరో తేదీ వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని పేర్కొన్నారు.