జిన్నా మూవీతో తన పేరును మార్చుకోబోతున్న మంచు హీరో.. ఫస్ట్ లుక్ టీజర్..!!

-

 సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. ఇక దాదాపుగా వీరి కుటుంబం నుంచి సినిమా విడుదల కాగా ఎన్నో సంవత్సరాలు అవుతుంది. కానీ తాజాగా మోహన్ బాబు గడచిన కొన్ని నెలల క్రితం సన్నాఫ్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రానికి నిర్మాతగా తన కూతురు మంచు లక్ష్మినే వ్యవహరించింది. ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఇక మంచు ఫ్యామిలీలో మంచు విష్ణు మా ప్రెసిడెంట్ గా ఎన్నికవ్వడం జరిగింది. ఇందుకోసం ఎంతో కష్టపడ్డారని చెప్పవచ్చు.

దీంతో ఒకవైపుగా మా ప్రెసిడెంట్ బాధ్యతలు చేపడుతూనే మరొకవైపు సినిమాలలో రాణించేందుకు తన వంతు కృషి చేస్తూనే ఉన్నారు మంచు విష్ణు. ఇక మంచు మనోజ్ కూడా తను చిత్రం విడుదల కాక దాదాపుగా మూడు సంవత్సరాల పైనే అవుతోంది. దీంతో అహం బ్రహ్మాస్త్ర అనే సినిమా షూటింగ్లో చాలా బిజీగా ఉన్నారు. అయితే తాజాగా మంచు మనోజ్ నటించిన జిన్నా సినిమాకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ వీడియో వైరల్ గా మారుతోంది. అయితే ఈ సినిమాతో తన పేరును మార్చుకోబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మంచు విష్ణు ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోలో జిన్నా షూటింగ్ మొదలవుతోంది అని పిలవడంతో షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమవుతాడు. దీంతో మంచు అభిమానులు సైతం మంచు విష్ణు తన పేరును జిన్నాగా మార్చుకోబోతున్నారా అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో వైట్ అండ్ వైట్ షర్ట్ లో మరొకసారి అదరగొట్టేలా కనిపిస్తున్నాడు మంచు విష్ణు. ఇక మంచు విష్ణు సరసన హీరోయిన్లుగా సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు. మరి ఎలాగైనా ఈ చిత్రంతో మరొకసారి విజయాన్ని మంచు ఫ్యామిలీ వరుస్తుందేమో తెలియాలి అంటే ఈ సినిమా విడుదల అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news