విజయమ్మ సెంటిమెంట్: షర్మిలకు కలిసొస్తుందా?

-

వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేసిన విజయమ్మ…ఇక నుంచి తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పెట్టిందో…అప్పటినుంచి విజయమ్మ..వైసీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. షర్మిలకు అండగా ఉంటూ వస్తున్న ఆమె…తన తనయుడు, ఏపీ సీఎం జగన్ పార్టీ అయిన వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదు. అయితే ఏపీలో వైసీపీ పూర్తి బలంతో ఉంది..ఈ నేపథ్యంలో తన అవసరం..షర్మిలకే ఎక్కువ ఉందని విజయమ్మ గ్రహించినట్లు తెలుస్తోంది.

అలాగే రెండు పార్టీల్లో ఉండటం కరెక్ట్ కాదని భావించి…తాజాగా వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో పాల్గొని..వైసీపీ గౌరవ అధ్యక్షురాలు పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు… ఇక నుంచి తెలంగాణలో షర్మిలకు అండగా ఉంటానని అన్నారు. వైసీపీ నుంచి తప్పుకున్న ఆమె..త్వరలోనే వైఎస్సార్టీపీ గౌరవాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలిసింది. గౌరవాధ్యక్షురాలి హోదాలో ఆమె లోట్‌సపాండ్‌ కేంద్రంగా పార్టీకి పూర్తి సమయం కేటాయించనున్నట్టు సమాచారం.

అక్కడ నుంచి షర్మిలకు రాజకీయ అండదండలు అందించనున్నారని తెలుస్తోంది…తెలంగాణలో ఇతర పార్టీల్లో ఉన్న వైఎస్సార్ సన్నిహితులని షర్మిల పార్టీలోకి తీసుకోచ్చేందుకు కృషి చేయనున్నారని సమాచారం. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు దూరంగా ఉన్న వైఎస్సార్ సన్నిహితుల సలహాలు, సూచనలు తీసుకుని షర్మిల రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేస్తారని తెలుస్తోంది. మొత్తం మీద విజయమ్మ…ఇంకా షర్మిల పార్టీ కోసం పనిచేయనున్నారు.

అయితే విజయలక్ష్మిని వైసీపీ గౌరవాధ్యక్షురాలిగా నియమించిన తర్వాత పార్టీ దశ మారిందని, అలాగే అధికారంలోకి వచ్చిందని వైఎస్సార్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆ సెంటిమెంట్‌ వైఎస్సార్టీపీకి కలిసి వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విజయమ్మ ద్వారా లక్ కలిసి..షర్మిలకు రాజకీయంగా బెనిఫిట్ అవుతుందని అంటున్నారు. కాకపోతే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు బలంగా ఉన్నాయి…మరి ఈ పార్టీలకు ధీటుగా షర్మిల ఏ విధంగా రాజకీయం నడుపుతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news