సినీ ఇండస్ట్రీలో మంచు బ్రదర్స్ వివాదం హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం పై తాజాగా మంచు లక్ష్మి స్పందించారు. మంచు విష్ణు – మనోజ్ మధ్య జరిగిన వివాదం గురించి తనకు ఇంకా పూర్తిగా తెలియదని.. పూర్తి వివరాలను తెలుసుకున్నాక మాట్లాడతానని తెలిపారు. విషయం పూర్తిగా తెలియకుండా వార్తలని స్ప్రెడ్ చేయడం సరికాదు అన్నారు మంచు లక్ష్మి.
ప్రస్తుతం బంధువులతో బిజీగా ఉన్నానని, అన్నదమ్ముల మధ్య వివాదాన్ని పరిష్కరించే ఆలోచన చేస్తున్నట్టు స్పష్టం చేశారు. అలాగే ఇంటి సభ్యులు, అన్నదమ్ముల మధ్య జరిగే గొడవగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని మీడియాకు విన్నవించారు మంచు లక్ష్మి.