అన్ లైన్ టికెట్ల విధానానికి మంచు విష్ణు మద్దతు

-

ఇవాళ ప్యానెల్‌ సభ్యులతో మంచు విష్ణు తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియాతో మంచు విష్ణు మాట్లాడారు.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం… తీసుకువస్తున్న అన్ లైన్ టికెట్ల విధానాన్ని తాను పూర్తిగా సమర్దిస్తున్నానని ప్రకటించారు మంచు విష్ణు. థియేటర్‌ టికెట్ల అమ్మకంలో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని… దీని వల్ల ప్రొడ్యూసర్లకు మరియు ప్రభుత్వానికి అందాల్సిన డబ్బు…మధ్యలో వారే తీసుకుంటున్నారని చెప్పారు.

ఒక నిర్మాతగా తాను… అన్ లైన్ టికెట్ల విధానాన్ని సపోర్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మమ్మల్ని నిలదీస్తే హక్కు ప్రతి సభ్యుడుకి ఉంటుందని.. ప్రకాశ్‌ రాజ్‌ అడిగినా చూపిస్తానని..తనకు రాజకీయాలపై జీరో నాలెడ్జ్ అని చెప్పారు.

పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్, ఆయన సపోర్ట్ కావాలి… ఇది మన తల్లి జాగ్రత్తగా చూసుకో విష్ణు అని నిన్న నాకు పవన్ కళ్యాణ్ చెప్పారని గుర్తు చేశారు. మా నాన్న కోపం అందరికీ తెలుసు… పోలింగ్ జరిగిన రెండు రోజుల తర్వాత మాపై దాడి చేశారు అని వాళ్ళు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సిసి ఫుటేజ్ లను వాళ్ళు చూసుకోవచ్చని… తనకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదన్నారు…

Read more RELATED
Recommended to you

Latest news