మందకృష్ణ మాదిగ అరెస్ట్..!

-

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ను  పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండానే డీఎస్సీ ద్వారా టీచర్ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయడాన్ని నిరసిస్తూ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ నుంచి మాదిగల నిరసన ప్రదర్శన చేపట్టారు. అయితే ఈ నిరసనను పోలీసుల అడ్డుకున్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో పాటు, పలువురు ఎమ్మార్పీఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ క్రమంలో ఇందిరాపార్క్ వద్ద ఎమ్మార్పీఎస్ నేతలు, పోలీసులకు మధ్య వాగ్వివాదం తోపులాట ఉద్రిక్తతకు దారి తీసింది. ఇందిరాపార్క్ ధర్నాచౌక్ నుంచి లోయర్ ట్యాంక్ బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించ తల పెట్టిన మాదిగల నిరసన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన ఆందోళనకారులను నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు 60 రోజుల వరకు తెలంగాణలో నోటిఫికేషన్లు ఇవ్వబోమని.. ఎస్సీ వర్గీకరణ చేసిన తరువాత నోటిఫికేషన్లను విడుదల చేస్తామని సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news