టీమ్ వర్క్ చేస్తే రాబోయే ఎన్నికలలో విజయం సాధిస్తామని ఏఐసీసీ ఇంచార్జి మాణిక్కమ్ ఠాగూర్ అన్నారు. బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా తెలంగాణా వచ్చిన ఆయన ఈరోజు కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, ఐక్యంగా పనిచేయడం చాలా ముఖ్యమని అన్నారు. ప్రతి నెలలో రెండు సార్లు తప్పకుండా కొర్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తామన్న ఆయన అన్ని విషయాలు చర్చించుకుందాం.. నాతో పార్టీ అంశాలు ఎప్పుడైనా మాట్లాడొచ్చని అన్నారు. నేను అన్ని వేళలా అందుబాటులో ఉంటానాన్న ఆయన రాబోయే రోజుల్లో నిరంతరం క్షేత్ర స్థాయి ఉద్యమాలు చేయాలని అన్నారు.
నిరంతరం ప్రజల్లో ఉండాలని ఆయన అన్నారు. కేసీఆర్ వ్యవసాయ బిల్లుల విషయంలో తెలివిగా ఆటలాడుతున్నారని, ఇప్పటి వరకు కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు అందరికంటే ముందుగానే కేసీఆర్ మద్దతు ఇచ్చారని అన్నారు. ఇప్పుడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నారని అన్నారు. మనం రైతుల పక్షాన పెద్దఎత్తున పోరాటం చేయాలన్న ఆయన ఆ పోరాటాలు, క్షేత్ర ఉద్యమాలతో జనం మధ్య ఉండాలని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. సోనియమ్మ త్యాగం తోనే తెలంగాణ సాధ్యం అయ్యిందని, ఆ త్యాగాన్ని జనంలోకి తీసుకెళ్లాలని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి బహుమతిగా ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.