తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తగ్గట్లేదు. ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ వచ్చి నేతలకు సర్ది చెప్పిన…అంతర్గతంగా రచ్చ మాత్రం జరుగుతున్నట్లే కనిపిస్తోంది. కాకపోతే మొన్నటివరకు బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించుకునే వారు. కానీ ఇప్పుడు కాస్త ఆగారు. పైగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా మాణిక్ ఠాగూర్‌ని పక్కన పెట్టి మహారాష్ట్రకు చెందిన మాణిక్ ఠాక్రేని నియమించారు. దీంతో కాంగ్రెస్ సీనియర్ల మాట కాస్త నెగ్గినట్లు అయింది.
ఎందుకంటే మాణిక్ ఠాగూర్ పూర్తిగా రేవంత్ రెడ్డికే సపోర్ట్ గా ఉంటున్నారనే సీనియర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన్ని తప్పించాలని సీనియర్లు..దిగ్విజయ్‌కు ఫిర్యాదులు చేశారు. సీనియర్ల ఫిర్యాదులతో ఠాగూర్ సైడ్ అయ్యి ఠాక్రే లైన్ లోకి వచ్చారు. ఇక ఇంచార్జ్ గా ఠాక్రే తాజాగా తెలంగాణకు వస్తున్నారు. పార్టీ నేతలతో సమావేశమై, వారి సమస్యలని తెలుసుకుని, పార్టీ పరిస్తితులని చక్కదిద్దాలని భావిస్తున్నారు.
మొదట ఏఐసీసీ కార్యదర్శులతో.. ఆతరువాత పీసీసీ అధ్యక్షుడు రేవంత్, సీఎల్పీ నేత భట్టి, పీఏసీ సభ్యులతో వ్యక్తిగతంగా సమావేశం కానున్నారు. నెక్స్ట్ పీఏసీ సభ్యుల సమావేశంలోనూ పాల్గొంటారు. అయితే ఈయన పూర్తిగా కాంగ్రెస్ నాయకులని లైన్ లో పెట్టి..అంతా సమన్వయం అయ్యేలా చేసి..ఇకపై పార్టీని బలోపేతం చేయడం పై ఫోకస్ పెట్టేలా దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది. అటు రేవంత్ పాదయాత్రపై చర్చించనున్నారని సమాచారం. అలాగే పాదయాత్రకు సీనియర్లు సహకరించేలా నేతలని సమన్వయం చేయనున్నారు. ఇక నుంచి ఎన్నికలే లక్ష్యంగా నేతలని ముందుకు నడిపించాలని చూస్తున్నారు. చూడాలి మరి ఠాక్రే ఎంట్రీతో తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి మెరుగు పడుతుందేమో.