సినీ పరిశ్రమలో మణిరత్నంది ఓ ప్రత్యేకమైన శైలి అని చెప్పొచ్చు. ఆయన సినిమాలను నిత్య నూతనంగా కొత్త ఒరవడికి దగ్గరగా ఉంటాయి. ఏ సినిమా చేసినా అందులోని క్యారెక్టర్లు మన ఇంట్లోని మాటలనే వినిపిస్తాయి. అలాంటి గొప్ప క్రియేటివిటీ ఉన్న మణిరత్నం ఇప్పుడు చేసిన ఓ వెబ్ సిరీస్ ఇప్పుడు దుమ్ములేపుతోంది.
మణిరత్నం సినిమాలు అంటేనే సహజత్వానికి చాలా దగ్గరగా ఉండేలా చూసుకుంటారు ఆయన. సినిమా సక్సెస్ అయినా కాకపోయినా ఆయన మాత్రం వాటితో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేశారు.
ప్రస్తుతం మణిరత్నం నిర్మాతగా తీస్తున్న సవరస అనే ఓ వెబ్ సిరీస్‌ను ఏకంగా తొమ్మిది మంది డైరెక్టర్లతో కలిసి తెరకెక్కిస్తున్నారు ఈ దర్శకుడు. విషయం ఏంటంటే ఈ వెబ్ సిరీస్‌లో నవరసాలను జోడిస్తూ ఒక్కొక్క ఎపిసోడ్‌లో ఒక్కొక్క రసాన్ని చూపించేందుకు మణిరత్నం ప్లాన్ చేస్తున్నారు. మరో డైరెక్టర్ జయేంద్రతో కలసి మణిరత్నం ఈ కొత్త వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటోంది.