టీఆర్ఎస్ నేతను చంపిన మావోయిస్ట్ అరెస్ట్

ఈ నెలలో తెలంగాణాలో అధికార పార్టీ నేతను మావోయిస్ట్ లు కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధ రాత్రి బయటకు లాక్కొచ్చి చంపిన విషయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రేస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు గస్తీ పెంచారు, ప్రతి రోజు కూంబింగ్ నిర్వహిస్తూ అనుమానితులను అరా తీస్తున్నారు. ఈరోజు కూంబింగ్ లో భాగంగా ఒకరిని అరెస్ట్ చేశారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలం కోడాపురం శివారులో ఉన్న బ్రిడ్జ్ వద్ద పోలీసులను, సిఆర్పీఎఫ్ పోలీసులు కలిసి వాహనాలు తనికీలు చేస్తుండగా, ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోబోయాడు. అతన్ని పట్టుకోని విచారించగా అతని పేరు లక్మయ్య అని అతను భీమేశ్వర రావును చంపిన వారిలో ఒకడినని ఒప్పుకున్నాడని సంకాహరం. లక్మయ్య గత మూడు సంవత్సరాలుగా మామావోయిస్టు మిలీషియా సభ్యునిగా పనిచేస్తూ మావోలు పరిసర ప్రాంతాలకు వచ్చినప్పుడల్లా వారికి భోజనాలు వసతి ఏర్పాటు చేస్తూ పోలీసుల కదలికలను ఎప్పటికప్పుడు మావోయిస్టులకు చేరవేస్తూ ఉండేవాడని గుర్తించారు పోలీసులు.