బ్రేకింగ్ : తెలంగాణాలో భారీగా మావోయిస్ట్ ల‌ లొంగుబాటు

Join Our COmmunity

తెలంగాణా పోలీసులు సక్సెస్ అయ్యారు. ఏజెన్సీలో పోలీసుల వ్యూహం ఫ‌లించింది. భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో భారీ గా మావోయిస్ట్ లు లొంగుబాటు బాట‌ ప‌ట్టారు. 33 మంది మ‌వోయిస్ట్ లు ఒకే సారి కొత్త‌ గూడెం ఎస్పీ సునీల్ ద‌త్ ఎదుట‌ లొంగిపోయారు. ఈరోజు తెలంగాణాలోని వివిద‌ ద‌ళాల‌కు సంబందించిన‌ మిలీషియా స‌భ్యులు భారీగా లొంగిపోయారు.

ఈ క్రమంలో లొంగిపోయిన‌ మిలీషియా స‌భ్యుల‌కు ప్ర‌భుత్వ‌ ప‌ధ‌కాలు అమ‌లు అయ్యేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని కొత్త‌గూడెం ఎస్పి సునీల్ ద‌త్ పేర్కొన్నారు. అభివృద్ధికి మావోయిస్ట్ లు ఆటంకంగా మారార‌ని, తెలిసి తెలియ‌క‌ ద‌ళాల్లో చేరుతున్న‌ యువ‌త‌ పున‌రాలోచ‌న‌ చేస్తున్నార‌ని ఈ సందర్భంగా సునీల్ పేర్కొన్నారు· ఇత‌ర‌ ద‌ళ‌ స‌భ్యులు సైతం జ‌న‌జీవ‌న‌ స్ర‌వంతి లోకి రావాల‌ని ఎస్పి సూచించారు. ఇక గత కొన్నాళ్లుగా పోలీసులు మావోయిస్ట్ లను ఏరివేసే కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.    

 

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news