పవన్‌కు ఎంపీ మార్గాని భరత్‌ కౌంటర్‌.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్లాలే అంటూ సెటైర్లు

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏపీలో వారాహితో యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల రెండో విడత వారాహియాత్ర ప్రారంభమైంది. అయితే.. సీఎం వైఎస్‌ జగన్‌ను ఉద్దేశిస్తూ.. పెళ్లాలు ఏంటి..? భార్య, సతీమణి, సహధర్మచారి లాంటి పదాలు వాడొచ్చు కదా? అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.. అయితే, పవన్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒకరు ఉంటే భార్య అంటారు.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్లాలే అంటూరు అంటూ సెటైర్లు వేశారు.. నమస్కారానికి కూడా సంస్కారం లేని వ్యక్తి పవన్ కల్యాణ్‌ అని మండిపడ్డ ఆయన.. వాలంటీర్లు ఉద్యమిస్తే ఎలా ఉంటుందో పవన్ రుచి చూశాడన్నారు. నిఘా వర్గాలు సమాచారం ఇవ్వటానికి పవన్ రాజ్యాంగేతర శక్తా? అంటూ ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌కు ఎంత మంది పిల్లలు ఉన్నారు? అని ప్రశ్నించారు.. ఒకరు ఉంటే భార్య అంటారు.. నలుగురు, ఐదుగురు ఉంటే పెళ్ళాలు అనే అంటారని కౌంటర్‌
ఎటాక్‌ చేశారు.

MP Margani Bharat Ram: జగన్ పాలనపై అన్ని వర్గాలు పూర్తి సంతృప్తి.. ప్రజలకు  ఏం కావాలో ఆయనకే తెలుసు..! - NTV Telugu

నీ రెండో సహధర్మచారి రేణూ దేశాయ్ నే స్వయంగా చెప్పారు మీడియా ఇంటర్వ్యూలో అన్నారు ఎంపీ భరత్.. ఒక భార్య ఉండగా ఇంకో అమ్మాయితో భర్త పిల్లలను కంటే ఎలా ఉంటుందో మీరే ఆ స్థానంలో ఉండి ఆలోచించండి అని చెప్పిన విషయాన్ని రాష్ట్రం అంతా చూసిందన్న ఆయన.. ఒట్టి కుండ శబ్ధం చేస్తుంది.. నిండు కుండ తొణకదన్నారు. ఇక, పవన్ కల్యాణ్‌ ఎక్కడ విప్లవం చేశాడు? ఏం విప్లవం చేశాడు? అని ప్రశ్నించారు. సినిమాల్లో చాలా చేయవచ్చు.. ఏదో సినిమాలో ఒక ప్యాంటు పై మరో సగం ప్యాంటు వేశాడు.. బయట కూడా అలా వేస్తాడా? అని ఎద్దేవా చేశారు.ఇక, జనసేన సభ్యత్వం కావాలంటే పేరు, వయస్సు, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, అడ్రస్ వంటి వివరాలు అన్నీ ఇవ్వాలి.. మరి దీనిని మినీ పెగాసెస్ అనాలా? అని ప్రశ్నించారు ఎంపీ భరత్‌.. వాలంటీర్లకు ఇచ్చే జీతాన్ని మందు బాటిళ్లతో పోల్చటం అంటే పవన్ కళ్యాణ్ కు ఎంత అహంకారం అంటూ మండిపడ్డారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అంటే అంత చులకనా? అని నిలదీశారు. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చారన్న ఆయన.. వృద్ధులకు ఒకటో
తేదీనే ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తుంటే పవన్ విషం కక్కుతున్నాడు అని విమర్శించారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు పచ్చజెండా కట్టుకుంటే కానీ పథకాలు అందించే వారు కాదన్న ఆయన.. లంచం ఇవ్వకుండా జన్మభూమి కమిటీలు పని చేసేవి కావని ఆరోపించారు.

మరోవైపు.. పవన్ కల్యాణ్‌ ఒక ఉదాహరణ చెప్పాడు.. ఒక మామిడి పళ్ల బుట్టలో రెండు పళ్లు పాడైతే మిగిలిన పళ్లూ పాడవుతాయి అన్నాడు.. జనసేనలో కొంత మంది బేవార్స్ గాళ్ళు ఉన్నారు.. అంటే జనసేనను కూడా బేవార్స్ పార్టీ అనాలా? అంటూ సెటైర్లు వేశారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌.

Read more RELATED
Recommended to you

Latest news