వైరల్‌ వీడియో.. పెళ్లి ఫోటోషూట్‌లో స్విమ్మింగ్‌పూల్‌లో పడ్డ ఫోటోగ్రాఫర్‌!

-

మన భారతీయ సాంప్రదాయపు వివాహాలు ప్రతి క్షణం ఓ సంతోషకరమైంది. భావోద్వేగాలతో నిండిన ఈ గొప్ప సమయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం. వివాహా తంతు కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తారు. చుట్టాలు, స్నేహితులతో హడావుడి ఉంటుంది. చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. అయితే, అపురూప క్షణాల్లో ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే అది జీవితాంతం గుర్తుండుపోతుంది. ఇలాంటి ఘటన ఒకటి జరిగింది . ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

wedding photographer falls into swimming pool during photoshoot

అసలు ఆ వీడియోలో అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరమేముందంటే.. ఓ వివాహాంలో వెడ్డింగ్‌ ఫోటో గ్రాఫర్‌ వధూవరుల వీడియో తీస్తూ… అనుకోకుండా స్విమ్మింగ్‌పూల్‌లో పడిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాగ్రాం పేజీలో వైరల్‌ అవుతోంది. వీడియోలో వధూవరులు తమ ఇంటి భవనం నుంచి బయటకు వస్తుంటారు. చుట్టాలు, సన్నిహితుల మ«ధ్య ఫోటో షూట్‌ జరుగుతూంటుంది. ఈ అద్భుతమైన క్షణాలను వారికి ఎదురుగా ఉన్న ఫోటో, వీడియో గ్రాఫర్‌ తమ కెమెరాల్లో బంధిస్తూంటారు. అయితే, వెంటనే ఆ జంట ఆశ్చర్యకరంగా నోరెళ్లదీసి చూస్తుంటారు.

వారు చూస్తుండగానే ఫోటోగ్రాఫర్‌ స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోయి, వెంటనే బయటకు వచ్చేస్తాడు. ఈ దృశ్యాన్ని వాళ్లు కళ్లారా చూసి అలా అయిపోయారు. ఆ మూమెంట్‌ను కూడా వీడియోలో జూమ్‌ చేసి మరీ చూపిస్తారు. ఇప్పటికే ఈ వీడియో లక్ష వ్యూస్‌ను దక్కించుకుంది. నెటిజన్ల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఏది ఏమైనప్పటికీ పూల్‌లో పడ్డ ఫోటోగ్రాఫర్‌ కొద్ది సమయంలోనే తేరుకుని, మళ్లి తన పనిలో పడ్డాడని, వావ్‌! అద్భుతమైన రికవరీ! అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news