లండన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిటీ ఎయిర్‌పోర్టుకు దగ్గర్లోని నార్త్ వూల్‌విచ్‌లోని 17వ అంతస్తు బిల్డింగ్‌లో భారీగా మంటలు చలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 15 ఫైర్ ఇంజిన్లు, 125 మంది సిబ్బంది చేరుకుని అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే భారీగా మంటలు వ్యాప్తి చెందడంతో దట్టమైన పొగలు కమ్మేశాయి. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదని అధికారులు తెలిపారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో వైరల్ అయింది. ఇప్పటికే తీవ్ర ఎండలు, వడగాల్పులతో లండన్ ప్రజలు విలవిలలాడుతున్నారు. ఎండల తీవ్రత కారణంగా లండన్‌లో పలు చోట్ల అగ్నిప్రమాదాలు సంభవిస్తున్నాయి. అలాగే బ్రిటన్‌లోనూ పలు చోట్లా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Fire in a top floor flat along Factory Road E16.
The smell of smoke is so so strong
Hoping everyone got out#Newham pic.twitter.com/xTH6ZK3t9M— Stevo (@Mr_Stevo87) July 20, 2022